తెలంగాణ

telangana

ETV Bharat / videos

'దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది' - Raghunandan ON Har Ghar Tiranga - RAGHUNANDAN ON HAR GHAR TIRANGA

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 4:53 PM IST

MP Raghunandan Rao at Har Ghar Tiranga programme In Medak : దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మెదక్​లోని పలు కళాశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండా పట్టుకొని పాదయాత్ర చేశారు. ఈ దేశం నాది అనే భావన రావాలనే ఉద్దేశంతో ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు. 

భగత్​సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాశ్​ చంద్రబోస్ లాంటి అనేక మంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేశారు. గతంలో పాఠశాలల్లో దేశభక్తి మీద ఉపన్యాస పోటీలు పెట్టి దేశభక్తి పెంపొందించే వారని, కానీ నేటి పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం చూస్తున్నారు తప్ప దేశాన్ని కాపాడే పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఎవరికీ లేదన్నారు. మన దేశంలో నూటికి 65 శాతం మంది యువకులు ఉన్నారని, అందుకే ప్రపంచానికి చదువుకున్న విజ్ఞులను అందిస్తుందని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే సత్తా ఉన్న విద్యార్థులు పుట్టిన గడ్డ భారతదేశం అన్నారు.

ABOUT THE AUTHOR

...view details