ETV Bharat / state

'అప్పుడెప్పుడో ఇచ్చిన ఇళ్లకు.. ఇప్పుడు 20 ఏళ్ల కిస్తీలతోపాటు వడ్డీ కట్టాలా ?' - NOTICE TO PAY DEBT FOR HOUSE

1982లో నిరుపేదలకు ఇళ్లు ఇచ్చిన అప్పటి ప్రభుత్వం - 42 ఏళ్ల తర్వాత 20 ఏండ్ల కిస్తీలు.. వడ్డీతో సహా చెల్లించి మార్టిగేజ్ నుంచి విడిపించుకోవాలంటూ నోటీసులు - అధికారుల నోటీసులివ్వడంతో నోరెళ్లబెడుతున్న బాధితులు

INDIRAMMA NOTICES IN WANAPARTHY
Notices to Beneficiaries to Pay Debt in Wanaparthy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Notices to Beneficiaries to Pay Debt in Wanaparthy : వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఎస్సీకాలనీలోని 125 మంది బీడీ కార్మికులకు 1982లో హైర్-‌పర్చెస్‌ పథకం కింద అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. 1985లో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించింది. అప్పట్లో ఆ ఇళ్ల నిర్మాణానికి రూ.16,500 ప్రభుత్వం ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.1,500 రాష్ట్ర హౌసింగ్‌ బోర్డుకు చెల్లించింది. అవి పోనూ మిగిలిన మొత్తాన్ని ఏడాదికి రూ.18,032 చొప్పున 20 ఏళ్ల పాటు లబ్దిదారులు కిస్తీల కింద చెల్లించాల్సి ఉంది.

నిరుపేదలు, బీడీ కార్మికులైన లబ్దిదారులు తాము చెల్లించలేమంటూ ప్రభుత్వానికి మెురపెట్టుకుంటున్నారు. ఆ బీడి కార్మికులవి రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు. దీనస్థితిలో ఉన్న తాము ఇప్పడికిప్పుడు లక్షలు చెల్లించాలంటే ఎలాగంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. వేల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయించుకున్నామని తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని చెబుతున్నారు. 42 ఏళ్ల తర్వాత డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంపై మండిపడుతున్నారు. మార్టిగేజ్​లో ఉండటంతో మున్సిపాలిటీ సహా ఇతర ప్రభుత్వ సేవలు సైతం ఎస్సీ కాలనీకి అందడం లేదని చెబుతున్నారు.

'మా ఇళ్లకు మార్టిగేజ్ అయినట్లు మాకు తెలియదు. ఎప్పుడో మా తాతలు ఉన్నప్పుడు దాదాపు 42 ఏళ్ల క్రితం ఆ ఇళ్లను ఇచ్చారు. ఇందిరమ్మ పాలనలోనే కట్టిన ఇళ్లకు మళ్లీ ఇందిరమ్మ ఇళ్లకు నోటీసులు ఇవ్వడం మాకు ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం స్పందించి బకాయిల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నా'- బాధితులు

బకాయిల నుంచి విముక్తి కల్పించాలని : పాలకులు మారినప్పుడల్లా తమ బకాయిలు రద్దు చేయాలని కోరామని ఎన్నికలొచ్చినప్పుడు హామీలివ్వడం తప్ప, ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. ఇళ్లు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో కొత్త ఇళ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. తుది నోటీసులు జారీ చేసిన హౌసింగ్ బోర్డు అధికారులు బకాయిల రద్దుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

'1982లో అప్పటి ప్రభుత్వం మాకు ఇళ్లు కట్టించి ఇచ్చింది. అప్పుడు మాకు ఈ ఇళ్లకు డబ్బులు కట్టాలని, రుణం చెల్లించాలని చెప్పలేదు. రెండేళ్ల క్రితం కూడా ఇలా నోటీసులు వస్తే మేము చెల్లించలేమంటూ స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తు ఇచ్చాం. మళ్లీ కాంగ్రెస్​ ప్రభుత్వంలో నోటీసులు ఇచ్చారు. ఆ డబ్బులు చెల్లించలేమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం'- బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.