ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఎంపీ రఘురామ పిటిషన్‌ - విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 6:56 PM IST

MP Raghu Rama Krishna Raju Petition: ముఖ్యమంత్రి జగన్, ఆయన బంధుగణానికి అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై సీబీఐతో దర్యాప్తు కోసం ఎంపీ రఘురామ వేసిన పిల్​పై హైకోర్టు జరిపింది. కాంట్రాక్టులు, ఆరోగ్య శాఖలో పరికరాల కొనుగోలుతో పాటు పలు అంశాల్లో సీఎం తన బంధువులకు ప్రాధాన్యత ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా సీఎం జగన్‌, బంధువులకు అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా తీసుకున్న నిర్ణయాలపై సీబీఐతో దర్యాప్తు కోరుతూ రఘురామ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో హైకోర్టులో ఇవాళ సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలోనూ విచారణ జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

ABOUT THE AUTHOR

...view details