తెలంగాణ

telangana

ETV Bharat / videos

తొలి దశ ఉద్యమకారులను గౌరవించకుండా ఏ ఉత్సవాలు చేసినా వృథానే : లక్ష్మణ్ - laxman Fecilitation to activitists

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 5:19 PM IST

MP Laxman Falicitation to Telangana Activists : తెలంగాణ సాధనకు బీజం వేసిన తొలి దశ ఉద్యమకారులను సన్మానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. తొలి దశ ఉద్యమకారులను గౌరవించకుండా రేవంత్ రెడ్డి ఏ ఉత్సవం జరిపినా వృథానేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతని ప్రశ్నించారు. వేడుకలు నిర్వహించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 1969 తెలంగాణ ఉద్యమకారులను లక్ష్మణ్ సన్మానించారు. 

1969లో తెలంగాణ ఉద్యమాన్ని ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అణచి వేశారని లక్ష్మణ్ విమర్శించారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ బలిగొందన్నారు. మలిదశ ఉద్యమంలో 12 వందల మంది అగ్నికి ఆహుతి అయితే కానీ సోనియా గాంధీ మనస్సు చలించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై రాజకీయ నిర్ణయం తీసుకున్న ఏకైక పార్టీ బీజేపీనేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ఈ పదేళ్లలో నెరవేరలేదని అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేర్చడం కోసం బీజేపీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details