ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

త్వరలోనే విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు - MP Kalisetti on Railway Zone - MP KALISETTI ON RAILWAY ZONE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 3:30 PM IST

MP Kalisetti Appalanaidu on Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన జరగనుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఇప్పటికే భూమి కేటాయింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. త్వరలోనే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటు అయితే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. 

విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఇందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వచ్చే ఏడాది మే నెల నాటికి భోగాపురంలో విమానాలు ల్యాండయ్యే అవకాశం ఉందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. వంద రోజుల కూటమి పాలనలో అనేక పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నికల్లో గొప్ప విజయాన్ని అందించారని, అందుకు తగ్గట్టుగానే ఎన్డీఏ కూటమి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details