ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఐదేళ్లపాలనలో జగన్‌ సొంత సంపాదనకే ప్రధాన్యమిచ్చారు: ఎంపీ సీఎం రమేష్ - MP CM Ramesh on Kadapa Steel - MP CM RAMESH ON KADAPA STEEL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 7:07 PM IST

MP CM Ramesh on Construction of Kadapa Steel Industry: వైఎస్ జగన్ పాలనలో కడప ఉక్కు పరిశ్రమలో ఒక్క శాతం పనులు కూడా చేయలేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి కావాలన్నారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ పురోగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఐదేళ్ల కాలంలో జగన్ సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారని పురపాలికల్లో ఎలాంటి అభివృద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ముంబాయిగా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరును మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చారని ఆరోపించారు. కడప జిల్లాలో జరిగిన భూ దందాలపై విచారణ చేయిస్తామని ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని ఎంపీ సీఎం రమేష్​ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details