ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌కు సైతం తప్పని జగన్ భజన! - ఆంధ్ర యూనివర్సిటీలో నిక్‌ వుజిసిక్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 10:04 AM IST

Motivational Speaker Nick Vujicic : వేదిక ఏదైనా, సభ ఎలాంటిదైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) భజన తప్పడం లేదు. ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ సైతం ఈ ఒత్తిడిని తప్పించుకోలేకపోయారు. యువతకు ప్రేరణ కలిగించే ఉపన్యాసం అంటూ ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University)లో నిక్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రసంగం ప్రారంభంలో ఆయన ఓ కాగితం చూసి 3 నిమిషాల పాటు ఏకబిగిన సీఎం గురించి గొప్పలు చెప్పుకొంటూ పోయారు.  

"ముఖ్యమంత్రి జగన్‌ నాకు, దేశానికి, ఎంతోమంది యువతకు ఆదర్శం. విద్యారంగంలో  ఆంధ్రప్రదేశ్​ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల్లో సౌకర్యాల అభివృద్ధి, ఇంగ్లీషు మాధ్యమంలో బోధన, అమ్మఒడి తదితర పథకాలు అమలు చేస్తున్నారు. ఆయన విజన్‌ గొప్పది. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి (AU VC Prasada Reddy), రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారు. థాంక్యూ గవర్నమెంట్‌.. థాంక్యూ వీసీ సర్‌. "- నిక్‌ వుజిసిక్‌, మోటివేషనల్‌ స్పీకర్‌

Nick Vujicic at Andhra University : నిక్ ఆ పేపర్​ను చూసి చదివి, అనంతరం తన కార్యక్రమాన్ని కొనసాగించారు. యువత నిరుత్సాహ పడకూడదని, సహనం, సానుకూల దృక్పధం అలవాటు చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రపంచానికి ఒక పెద్ద మేధో మానవ వనరుగా భారత్ ఉందని అన్నారు. ఉన్నత ఆశయాలు పెట్టుకోవడం వాటిని సాధించి దేశానికి సమాజానికి మేలుచేయడమే ప్రధాన లక్ష్యం చేసుకోవాలని అన్నారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, వందలాది విద్యార్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details