తెలంగాణ

telangana

ETV Bharat / videos

'దిల్లీలో సైతం మార్పు రావాలి - పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం' - MLC Kodandaram Interview

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 4:52 PM IST

MLC Kodandaram Interview : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితంకావడం పట్ల ఆచార్య కోదండరాం సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడం కోసం ఒక మార్గం దొరికిందన్నారు. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఆమోదించిన గవర్నర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా చట్టసభల్లోకి వెళ్తున్నామని అందుకే కొంత అధ్యయనం చేసి అడుగు పెడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సహకరిస్తూనే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

TJS Chief Kodandaram Appointed as MLC in  Governor Quota : చట్టసభల ద్వారా ప్రజాసమస్యలపై గళమత్తటమే కాకుండా, ఆ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి సరిగ్గా ఈ నేపథ్యానికి మాకు వచ్చిన ఈ అవకాశమనేది చాలా ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రజాసమస్యలపై ఏవిధంగా పోటారటం చేశారో, అంతేస్థాయిలో ఇప్పుడు కూడా ప్రజాగొంతుకగా నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా దిల్లీలో కూడా మార్పు రావాలంటున్న కోదండరాంతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ఫేస్ టూ ఫేస్.

ABOUT THE AUTHOR

...view details