తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : హైదరాబాద్​లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 10:11 AM IST

Updated : Feb 8, 2024, 10:17 AM IST

MLC Kavitha Live : సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం హైదరాబాద్​ నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నియామకపత్రాలను సీఎం రేవంత్​రెడ్డి అందజేశారు.  కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కృషిచేసిన నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని రేవంత్​రెడ్డి తెలిపారు. సింగరేణి నుంచి కొనుగోలు చేసిన బొగ్గుకు సొమ్ములు చెల్లించకుండా సంస్థ ఖాయిలా పడే పరిస్థితిని కేసీఆర్‌ సర్కార్ కల్పించిందని ఆరోపించారు. కేంద్రం గనులను ప్రైవేట్​పరం చేస్తూ సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నా అప్పటి పాలకులు ప్రశ్నించలేదని విమర్శించారు. ఇతర సమస్యల పరిష్కారంలోనూ పదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని అన్నారు. సింగరేణి ఎన్నికల్లోనూ కార్మికులు కారు పార్టీకి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పోలైన 38,000 ఓట్లలో బీఆర్ఎస్​కు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి 1,298 ఓట్లు మాత్రమే దక్కాయని వివరించారు. తద్వారా గులాబీ పార్టీ అక్కడ స్థానం లేదని తేల్చి చెప్పారని రేవంత్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిన్న రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.

Last Updated : Feb 8, 2024, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details