తెలంగాణ

telangana

ETV Bharat / videos

పరీక్షలు వాయిదా వేయాలంటూ కేటీఆర్, హరీశ్​రావు యువతను ఆందోళనకు గురి చేస్తున్నారు : జీవన్‌రెడ్డి - MLC Jeevan Reddy Fires on BRS - MLC JEEVAN REDDY FIRES ON BRS

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 4:54 PM IST

MLC Jeevan Reddy Fires on BRS Party : నిరుద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్​రావు మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సూచించారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ, యువతను ఆందోళనకు గురి చేస్తున్నారని జగిత్యాలలో మండిపడ్డారు. ఈ మేరకు జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న వాదనలను తిప్పికొట్టారు. ఈ ఏడాది మరో డీఎస్సీ కూడా వేస్తున్నామన్న జీవన్​రెడ్డి, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

పదేళ్ల పాలనలో ఉద్యోగాలు కల్పించలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటనలిస్తుంటే ఓర్వలేకపోతుందని దుయ్యబట్టారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా ఒకటికి 50 నిష్పత్తిలో పిలిస్తే, 100 మందిని పిలవాలని పేర్కొనటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే లక్షలాది మంది డీఎస్సీ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే, పరీక్ష రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్‌ చేయడం సరికాదని జీవన్‌రెడ్డి సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details