నన్ను ఎంపీగా గెలిపిస్తే జక్రాన్‌పల్లికి పసుపు బోర్డు తీసుకొస్తా : జీవన్ రెడ్డి - MLC Jeevan Reddy Election Campaign - MLC JEEVAN REDDY ELECTION CAMPAIGN
Published : Apr 14, 2024, 7:51 PM IST
MLC Jeevan Reddy Election Campaign : తనను ఎంపీగా గెలిపిస్తే జక్రాన్‌పల్లి గడ్డపై పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని నిజామాబాద్ లోక్‌సభ కాంగ్రెస అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్టు ఎక్కడ ఉందో తనకే తెలియని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ గత పది సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా పెట్టుబడులను పెంచారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యానికి 2004-2014 వరకు మద్దతు ధరను 3 రెట్లు పెంచిందని, కానీ బీజేపీ పాలనలో 1 శాతం కూడా పెంచలేదని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 7 నుంచి పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు కల్యాణ లక్ష్మి ద్వారా రూ.1 లక్ష, తులం బంగారం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క బీడీ చేసే మహిళలకు పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు.