ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ముంపు బాధితులకు ఆహారా సరఫరా - పర్యవేక్షించిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు - MLA Nakka Anand Babu Supply Food - MLA NAKKA ANAND BABU SUPPLY FOOD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 4:34 PM IST

MLA Nakka Anand Babu Supply  Food To Bapatla Flood Victims : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లంక గ్రామాలలో చిక్కుకున్న ముంపు బాధితులకు అధికారులు ఆహారం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొల్లూరు లాకుల వద్ద నుంచి 48 బోట్లలో అల్పాహారం, నీళ్లు, బిస్కెట్లు, కేకులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరఫరా ప్రక్రియను కలెక్టర్ వెంకట మురళితో కలిసి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పర్యవేక్షించారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 

కొల్లూరు లంక గ్రామాలకు ఫుడ్, వాటర్, మెడిసిన్  ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎన్డీఆర్​ఎఫ్​ (NDRF) సిబ్బంది అవ్వులవారిపాలెంలోని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పవర్‌ బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా మంత్రుల సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details