వైఎస్సార్ చేయూత సంబరాల్లో డీజే సౌండ్లు - పరీక్ష రాస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు - asara meeting in junior college
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 4:16 PM IST
MLA Mekapati Asara Meeting Disturbed Inter Exams in Nellore District : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల (Government Junior College)లో జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సాక్షిగా తీవ్ర ఆటంకం ఏర్పడింది. కాలేజీ ప్రాంగణంలో ఓ వైపు ఇంటర్ పరీక్షలు జరుగుతుంటే మరోవైపు ఎమ్మెల్యే మేకపాటి వైఎస్సార్ చేయూత సంబరాల పేరిట నానా హంగామా చేశారు. కోలాటాలు, డీజే సౌండ్లు భారీగా పెట్టడంతో పరీక్షలు (Exams) రాసే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. విద్యార్థులు ఒక వైపు పరీక్షలు రాస్తుంటే డీజేలో పాటలు పెట్టడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి (MLA Mekapati Vikram Reddy) పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదివరకే పెద్దసారు సభలంటే ప్రజలకు సమస్యలు అన్నట్లు తయారైంది. ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.