ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రేషన్​ సరుకుల వ్యాన్​పై జగన్​ ఫొటో - చర్యలకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం - YS Jagan Photo on Ration Van - YS JAGAN PHOTO ON RATION VAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 9:22 AM IST

MLA Govinda Rao Fire about YS Jagan Photo on Ration Van : శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేట మండలం ఎంబరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రంతో రేషన్ సరుకులు పంపిణీ చేయడంపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం యంబరాం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే గోవిందరావు వెళ్లారు. గ్రామంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సారిగా సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించారు. గ్రామానికీ వచ్చిన వాహనానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రం చూసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత చిత్రాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారులు, ఎండీఎం (MDM) నిర్వాహకులు ఖాతరు చేయకుండా జగన్​ ఫొటో ఉన్న వాహనంతో సరుకులు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. వెంటనే తహసీల్దార్​కి ఫోన్ చేసి సంబంధిత శాఖల అధికారులపై చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.  

ABOUT THE AUTHOR

...view details