ఆటోలో అసెంబ్లీకి పాడి కౌశిక్‌రెడ్డి - డ్రైవరన్నల సమస్యలు తెలుసుకునేందుకేనన్న ఎమ్మెల్యే - ఆటోలో అసెంబ్లీకి ఎమ్మెల్యే కౌశిక్
Published : Feb 8, 2024, 1:13 PM IST
MLA Kaushik Reddy Auto Ride Today : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఈ సమావేశాలకు పలువురు నేతలు వారి వాహనాల్లో కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా ద్వారా చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం గురించి మహిళల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
మరోవైపు ఉచిత ప్రయాణం పథకంతో రాష్ట్ర సర్కార్ ఆటో కార్మికుల పొట్ట గొడుతోందని నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఉచిత ప్రయాణం మహిళలకు మేలు చేస్తున్న పథకమే అయినా అది ఆటో కార్మికుల పొట్ట కొడుతోందని వాపోయారు. కార్మికులకు ఓ తోవ చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చినా, వారి సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించలేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు రేవంత్ సర్కార్ ఇస్తానన్న రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేసి వీధిన పడ్డ వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.