మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ - జనావాసాల వద్దకు భారీగా చేరిన నీరు - Mission Bhagiratha Pipeline Leak
Published : May 3, 2024, 5:55 PM IST
Mission Bhagiratha Pipeline Leak In YELLANDU : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కోర్టు ఏరియాలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకైంది. దీంతో స్థానిక నివాసాల ప్రాంతాన్ని భారీనీటి ప్రవాహం ముంచెత్తింది. నివాసాలకు సమీపంలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న వేళ జలం వృథాగా పోతుందని స్థానికులు వాపోతున్నారు. కాగా నీటి ఉద్ధృతి ధాటికి ఓ ఇంటి ప్రహారీ గోడ కూలిపోయింది.
మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ అయిన ప్రాంతంలో రహదారి సైతం దెబ్బతింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం వెళ్లే ప్రధాన పైప్లైన్ ఇది. లీకేజీ కారణంగా నీటి ప్రవాహం ఉద్ధృతంగా ప్రధాన రహదారి నుంచి వృథాగా పోతోంది. కాగా మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన లీకేజీని సరి చేస్తామని తెలిపారు. గతంలో కూడా ఓసారి ఇల్లందులో మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయింది.