తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల మీడియా సమావేశం - మేడారం ఏర్పాట్లపై మంత్రుల లైవ్

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 12:20 PM IST

Ministers Press Meet on Medaram Live : మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మేడారం జాతరకు ఎక్కువ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. అదనంగా బస్సులు ఏర్పాటు చేశామని వివరించాం. ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులను మేడారంలో ఉంచామని వెల్లడించారు. మేడారం జాతరలో పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయి అధికారులను నియమించామని పేర్కొన్నారు.  మరో రెండ్రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.  మరోవైపు మేడారం వెళ్లే భక్తులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మహా జాతర నేపథ్యంలో  భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. ఆభరణాలు వంటి విలువైన వస్తువుల సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు. ఇక మేడారం మహాజాతర ఏర్పాట్లపై తాజాగా మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details