'యాదాద్రీశుడి ఆశీస్సులతో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది' - Yadadri Laxmi Narasimha Temple - YADADRI LAXMI NARASIMHA TEMPLE
Published : Sep 22, 2024, 3:05 PM IST
Yadadri Laxmi Narasimha Temple : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిచేలా చేస్తామని ఆయన తెలిపారు. ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఆలయాన్ని కలియ తిరిగి చూశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు మంత్రులకు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేసి, శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకుంటారని యాదాద్రి కలెక్టర్ తెలిపారు.