ఏటా ఆరున్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు సృష్టిస్తాం : ఉత్తమ్ - Uttam Released Sagar Water - UTTAM RELEASED SAGAR WATER
Published : Aug 2, 2024, 9:33 PM IST
Minister Uttam Kumar Released Nagarjuna Sagar Water : కాంగ్రెస్ కట్టే డ్యాములు నాగార్జున సాగర్లా ఉంటాయని బీఆర్ఎస్ వాళ్లు కట్టే ప్రాజెక్టులు కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుల ఉంటాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులతో కలిసి నాగార్జున సాగర్ ఎడమ కాలువకి నీటిని విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరిగేషన్కి పెద్ద పీట వేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సాగర్‌కు వరద పోటెత్తుతోందని తెలిపారు. భారీ వరద వస్తుండటంతో ఎడమకాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టు రైతాంగం పంటల సాగుకు సాగునీరందనుంది. నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.