ఖమ్మంలో త్వరలో నూతన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు : తుమ్మల నాగేశ్వరరావు - Minister Tummala Khammam Visit
Published : Feb 5, 2024, 4:17 PM IST
Minister Tummala Visited Khammam Today : ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం పాత కలెక్టరేట్ భవనంలో వైద్య కళాశాల భవనం కొనసాగుతోందని, త్వరలోనే కొత్త ప్రదేశంలో నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. వైద్య సిబ్బందితో కలిసి కళాశాల పరిసరాలను పరిశీలించిన మంత్రి అనంతరం అధికారులు, కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు.
Tummala On Khammam New Medical College Building : భవిష్యత్‌లో చేపట్టే ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంపై ఈ సమీక్షలో చర్చించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గర ఉండటంతో అప్పటి నూతన కలెక్టరేట్లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఉత్తమ వైద్య కళాశాలగా నిర్మించాలంటే మెరుగైన వసతులు ఉండాలని, దానికి అనుగుణంగా సంబంధిత అధికారులతో సమీక్షించి నూతన వైద్య కళాశాల నిర్మాణంపై ఓ నిర్ణయానికి వచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.