తెలంగాణ

telangana

ETV Bharat / videos

మూడు రోజుల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పూర్తవుతుంది : మంత్రి శ్రీధర్​ బాబు - Sridhar Babu Ram Navami Celebration - SRIDHAR BABU RAM NAVAMI CELEBRATION

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 8:07 PM IST

Minister Sridhar Babu Sri Rama Navami Celebration : రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని శ్రీరామ్‌నగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీధర్‌ బాబు(Sridhar Babu) ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముడికి ఎన్ని కష్టాలు వచ్చిన ధర్మంగా తన రాజ్యాన్ని నడిపించారని గుర్తు చేశారు. ఆయన నడిపిన బాటలో అందరూ వెళ్లాలని సూచించారు. అందరూ ఆరోగ్యంతో, ఆనందంగా జీవించాలని కోరుకున్నానని వెల్లడించారు. 

Sridhar Babu on Farmers MSP : మంథనిలోని స్థానికులతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి ఖరిఫ్​లో పంటలు పండాలని, రైతులకు మేలు జరగాలని సీతారాములవారిని వేడుకున్నానని తెలిపారు. రెండు మూడు రోజుల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కార్యాచరణ పూర్తవుతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details