ఏఐ సిటీ కోసం హైదరాబాద్‌లో 200 ఎకరాల కేటాయింపు : మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar launch Tech Hub - MINISTER SRIDHAR LAUNCH TECH HUB
Published : Apr 4, 2024, 3:41 PM IST
Minister Sridhar Babu opened Cyber Towers Tech Hub : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్తులో ఈ రంగంలో అపార అవకాశాలుంటాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుతం దేశంలో సాఫ్ట్వేర్ రంగంలో 2వ స్థానంలో ఉన్న హైదారాబాద్‌ను మొదటి ర్యాంకుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇవాళ సైబర్ టవర్స్‌లో పీఎస్ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హబ్‌ను మంత్రి ప్రారంభించారు. జూలైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామని, ఏఐ(AI) సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని మంత్రి ప్రకటించారు.
Minister Sridhar about Artificial Intelligence : ఈ రంగంలో విస్తృత పరిశోధనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని మంత్రి శ్రీధర్ చెప్పారు. సాఫ్ట్వేర్ పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరింపజేసేందుకు ఐటీ సంస్థలు సహకరించాలని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి పరిశ్రమ అవసరాలు తీర్చుతామన్నారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న ఈ తరుణంలో తమ సంస్థ తయారు చేసిన సాంకేతికత ద్వారా ఫేస్ రికగ్నిషన్‌తో సోషల్ మీడియా ఐడీ సురక్షితంగా ఉంచుకోవచ్చని సంస్థ నిర్వాహకులు చెప్పారు.