తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహిళా దినోత్సవ వేడుకలో బామ్మ దరువు, మంత్రి సీతక్క డ్యాన్స్ - Seethakka

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 5:43 PM IST

Updated : Mar 14, 2024, 5:55 PM IST

Minister Seethakka Dance In Hyderabad : తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళల్లో చాలా మంది రక్త హీనతతో బాధపడుతున్నారని పౌష్టికాహారం లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. 

Seethakka : ఆదివాసీ బిడ్డగా విప్లవ ఉద్యమంలోకి వెళ్లి గన్ను పట్టానని ఉద్యమం నుంచి బయటకు వచ్చాక ప్రజాసేవ చేసేందుకు తనకు ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించిన మంత్రి, వారిని నగదు ప్రోత్సాహకాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారిణి దరువుకు దివ్యాంగురాలైన భాగ్య అనే విద్యార్థితో కలిసి మంత్రి డ్యాన్స్ చేశారు.

Last Updated : Mar 14, 2024, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details