తెలంగాణ

telangana

ETV Bharat / videos

గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం : మంత్రి పొన్నం - Minister Ponnam Visit sircilla

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 7:31 PM IST

Minister Ponnam Visit Karimnagar : గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన చిగురుమామిడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న మంత్రి అధికారులతో చర్చించి, హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.

అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో పాఠశాల, గ్రామ పంచాయతీ నూతన భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన ఆయన ప్రతి కుటుంబం విద్యకు అత్యంత ప్రాధాన్యత కోరారు. విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో అంతిమంగా సమాజం బాగుపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం విద్యా అభివృద్ధికి తోడ్పడుతుందని  మంత్రి హామి ఇచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు, టెస్క్రాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details