రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది : మంత్రి పొన్నం - Minister Ponnam fires On BJP - MINISTER PONNAM FIRES ON BJP
Published : May 2, 2024, 7:00 PM IST
Minister Ponnam Prabhakar Fires On BJP Government : కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ పన్నాగం పన్నుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దేశ సంపదను అదానీకి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాలా రాజేందర్ రావుకు మద్ధతుగా పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగానే బీజేపీపై పలు విమర్శలు గుప్పించారు.
వెలిచాల రాజేందర్ రావు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాగంపేట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని ఇప్పటికే వాటిలో అయిదింటిని అమలు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలను కొనసాగుతుందన్నారు. కరీంనగర్‌కు తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వినోద్ కుమార్, బండి సంజయ్‌లు చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.