తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి ప్రాధాన్యత వారికే : మంత్రి పొంగులేటి - Ponguleti On Indiramma House Scheme

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 5:35 PM IST

Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలకు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాతి విడతలో ఇంటి స్థలం అందజేస్తామని, అందులో కూడా ఎవరి గృహాలు వారే నిర్మించుకుంటారని మంత్రి వివరించారు. వారికి ఇవ్వాల్సిన నిధులను నిర్దేశించిన సమయంలో విడతల వారీగా విడుదల చేస్తామని తెలిపారు.

మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు అయినట్లు వివరించిన మంత్రి, ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500కు తగ్గకుండా ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏవైతే మౌళిక వసతులు లేకుండా, నిరుపయోగకరంగా ఉన్న వేలాది ఇళ్లను కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో భేషజాలకు పోకుండా వాటికి కావాల్సిన నిధులు సైతం సమకూర్చామన్నారు. అంతేకాకుండా గతంలో మాదిరిగా ఇరవై, ముప్పై ఫ్లోర్​లలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అనుకోవటం లేదని, పరిమిత లెవల్​లో మాత్రమే స్థలాన్ని అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details