ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పౌరసరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం- వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు కోకొల్లలు : మంత్రి నాదెండ్ల - Nadendla Manohar Fires on YSRCP - NADENDLA MANOHAR FIRES ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 2:46 PM IST

Nadendla Manohar Fires on YSRCP : పౌరసరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని  మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ఓ కుటుంబం కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకుని రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్‌లో తనిఖీలు చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా 26,488 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

రేషన్ బియ్యం తరలింపు కేసులో విచారణ కొలిక్కి వచ్చిందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ అక్రమాల్లో ఎంతటి వారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే 41 ఏ ద్వారా వారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు కాకినాడ పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు, హమాలీల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. చెక్‌పోస్ట్ వద్ద అదనపు సిబ్బందిని నియమించి 3 షిఫ్టుల్లో తనిఖీలు చేయనున్నట్లు వివరించారు. అవసరమైతే ఒకటి లేదా రెండు చెక్‌పోస్టులు అదనంగా ఏర్పాటు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details