ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గంగానమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంపతులు - Minister Lokesh inaugurated temple - MINISTER LOKESH INAUGURATED TEMPLE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 5:27 PM IST

Minister Lokesh Inaugurated Ganganamma Thalli Temple in Guntur District : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంగానమ్మతల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు పాల్గొన్నారు. ముందుగా లోకేశ్, బ్రాహ్మణిలకు ఆలయ కమిటీ పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి లోకేశ్ దంపతులు చీరను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు లోకేశ్ చెప్పారు. ఏటా ఆషాడమాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. 

తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతి రెడ్డి సాంబిరెడ్డి నేతృత్వంలో గత సంవత్సరం ఆలయాన్ని పునఃనిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన దొంతి రెడ్డి సాంబిరెడ్డి, కమిటీ సభ్యులను లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details