తెలంగాణ

telangana

ETV Bharat / videos

మతతత్వ పార్టీలోకి పోవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డికి లేదు : కొండా సురేఖ - Konda Surekha on BJP BRS - KONDA SUREKHA ON BJP BRS

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 5:34 PM IST

Minister Konda Surekha on BRS : కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తేనే దేశంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య రెండో సెట్‌ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరిలతో కలిసి ఆమె పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​లు అంతర్గతంగా ఒప్పందం చేసుకుని, బహిర్గతంగా తిట్టుకుంటున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వమే ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి చేర్చుకునే సంస్కృతి తీసుకొచ్చిందని విమర్శించారు.

Konda Surekha on BJP : నిన్న వరంగల్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కొండా సురేఖ, మతతత్వ పార్టీలోకి పోవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మార్పులేమీ జరగవని, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో లేరని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్​ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి కోసం నాయకులందరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details