వీధి దీపాలు లేవంటూ ఫిర్యాదు - అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం - Minister Fires On GHMC Officials
Published : Jan 29, 2024, 2:58 PM IST
Minister Kishan Reddy visit to Nampally : హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. కాలనీల్లో నడుచుకుంటూ ప్రజలను కలిసిన కిషన్‌రెడ్డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా మల్లెపల్లి డివిజన్‌లోని అఘాపురలో పవర్‌బోర్‌ను ఆయన ప్రారంభించారు. ఆరు నెలలుగా వీధి దీపాలు లేవంటూ స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని తెలిపారు.
Union Minister Kishan Reddy Fires On GHMC Officials : వీధి దీపాలు లేక రాత్రిపూట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. సమస్యలపై అధికారులతో ఆరా తీసిన కేంద్ర మంత్రి నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు. నిధులు లేవంటూ అధికారులు సమాధానం ఇవ్వటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. మల్లేపల్లి డివిజన్ అఘాపురలో వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు కిషన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.