తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం - Jupally Krishna Rao Press Meet - JUPALLY KRISHNA RAO PRESS MEET

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 12:14 PM IST

Updated : May 24, 2024, 12:32 PM IST

Minister Jupally Krishna Rao Press Meet Live : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గురువారం దారుణ హత్య చోటుచేసుకుంది. శ్రీధర్​ రెడ్డి (45) అనే స్థానిక బీఆర్​ఎస్​ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఆరు బయట నిద్రిస్తున్న శ్రీధర్‌ రెడ్డిపై గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.BRS Leaders Condemned Sridhar Reddy's Murder : ఇదిలా ఉండగా శ్రీధర్ రెడ్డి హత్యను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. హత్య దారుణమన్న మాజీ మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బీఆర్​ఎస్​ నాయకులు హత్యకు గురి కావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావులేదని, ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.
Last Updated : May 24, 2024, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details