ఆత్మసాక్షి ఉంటే రాజీనామా చేయాలి - హరీశ్‌రావుకు జూపల్లి సవాల్ - assembly meetings on irrigation
Published : Feb 17, 2024, 3:56 PM IST
Minister Jupally fires on Harishrao : హరీశ్‌రావు గట్టిగా మాట్లాడి రాజీనామా చేస్తానన్న మాత్రానా వాస్తవాలు మారవని ఎక్సైజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదని చెబుతున్నారని, అవినీతి జరిగిందో లేదో హరీశ్‌రావు ఆత్మసాక్షిగా చెప్పాలని పేర్కొన్నారు. చిత్తశుద్ధి, ఆత్మసాక్షి ఉంటే హరీశ్‌రావు రాజీనామా చేయాలని జూపల్లి సూచించారు.
White Paper on Irrigation Projects : నీటిపారుదల రంగంలో రూ.1.8 లక్షల కోట్లతో టెండర్లు చేపట్టారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు చేపట్టిన టెండర్లలో పెద్దఎత్తున మతలబు జరిగిందని దుయ్యబట్టారు. పిలిచిన 300 టెండర్లలో కోటింగ్‌లలో తేడా 1శాతం లోపు ఉండటం విచిత్రంగా ఉందన్నారు. ఇందులోని లోగుట్టు కేసీఆర్, హరీశ్‌రావుకు తెలియదా అని జూపల్లి ప్రశ్నించారు. అవినీతి జరగలేదని రుజువు చేయాలని, వీటినుంచి ఎలా తప్పించుకుంటారని మండిపడ్డారు. రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు కదా అని మండిపడ్డారు. నిజాయతీపరులు మాటలతో నమ్మించలేరు. చేతల ద్వారా మెప్పించాలని జూపల్లి పేర్కొన్నారు.