కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం: మంత్రి బుగ్గన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 9:31 PM IST
Minister Buggana on Drinking Water Problem: వేసవిలో కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Minister Buggana Rajendranath Reddy) తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాస్‌తో పాటు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడటం వల్ల తాగునీటి సమస్య(Drinking Water Problem) ఉందని, దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan)కే దక్కిందని మంత్రి తెలిపారు. కొన్ని సమస్యల కారణంగా పనులు జరగకపోయినా జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC)లు, సర్పంచులు(Sarpanches) ఓపికగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో వారికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులు మంచిగా ఉంటాయని, అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయని బుగ్గన తెలిపారు.