ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజధాని నిర్మాణానికి మహిళాసంఘాల భారీ విరాళం- రూ.5.5 కోట్లు చంద్రబాబుకు అందజేత - Women Associations Donation - WOMEN ASSOCIATIONS DONATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 8:03 PM IST

MEPMA and DWCRA Associations Donation to Amaravati: చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు ఉదారత చాటుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఐదున్నర కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. కుప్పం బహిరంగ సభలో ఈ మేరకు చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. డ్వాక్రా సంఘాల తరఫున నాలుగున్నర కోట్లు, మెప్మా తరఫున కోటి రూపాయలను రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చారు. చంద్రబాబు కృషి వల్లే తాము చాలా ఎత్తుకు ఎదిగామని డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.

"1996-97లో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశా. మన మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా మారాయి. వడ్డీ లేని రుణాలిచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహించాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళా సంఘాలు అలాగే నిలబడ్డాయి. ప్రతి డ్వాక్రా మహిళను లక్షాధికారిగా చేసేందుకు చర్యలు తీసుకొంటాం." - సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details