చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో స్వాతంత్య్ర వేడుకలు - జెండా ఎగరేసిన మెగాస్టార్ - Chiranjeevi hoisted national flag - CHIRANJEEVI HOISTED NATIONAL FLAG
Published : Aug 15, 2024, 5:14 PM IST
Chiranjeevi Unveiled National Flag : హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అభిమానులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకల్లో చిరంజీవి కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్, మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తన అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆయన తెలిపారు. దేశంలోని పౌరులందరూ నిబద్ధతతో ఉంటూ దేశ అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన సూచించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఓ స్వచ్ఛంద సంస్థ లక్ష మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బ్లడ్ బ్యాంక్‌లో రక్తం దానం చేసిన వారికి ఈ మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ పరిసరాల్లో పలువురు మొక్కలు నాటారు.