LIVE : మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీట్ ది ప్రెస్ - RAGHUNANDHAN MEET THE PRESS LIVE - RAGHUNANDHAN MEET THE PRESS LIVE
Published : Apr 21, 2024, 12:34 PM IST
|Updated : Apr 21, 2024, 1:53 PM IST
Medak BJP Candidate Raghunandhan Rao in Meet The Press Live : అభ్యర్థులు పోటీచేసే స్థానాలు మార్చడం సాధారణమే అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల వేళ ఏదైనా మాట్లాడతాం అంటే సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని రఘునందన్ సూచించారు. ఇటీవల ఆదిలాబాద్‌లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్‌రెడ్డే అని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి కేరళ ప్రచారానికి వెళ్లినప్పుడు కమ్యూనలిస్టులు అన్నారని చెప్పారు. తెలంగాణకు వచ్చాక కమ్యూనిస్టులను పొగుడుతారని ఏది నమ్మాలని నిలదీశారు. తాము గడీల్లో ఉన్నామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఎక్కడ ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోని వచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలు అమలు చేయలేదంటూ మండిపడ్డారు. వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Last Updated : Apr 21, 2024, 1:53 PM IST