తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం - కండక్టర్​ను ఘనంగా సన్మానించిన ఆర్టీసీ ఎండీ - RTC MD Appreciation To Employees - RTC MD APPRECIATION TO EMPLOYEES

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 10:51 PM IST

RTC MD Appreciation To Employees : టీజీఎస్ ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్​లో ఇవాళ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. బస్సులో జన్మించిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్​ను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్​లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్​ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చిన్నారికి బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్​ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు ఆర్టీసీ బస్సులో జన్మించిన పాపకు జీహెచ్​ఎంసీ అధికారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జడ్జిఖానాలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తల్లీబిడ్డల యోగ క్షేమాలు తెలుసుకున్న జీహెచ్​ఎంసీ అధికారుల బేబీ ఆఫ్ శ్వేతారత్నం పేరుతో ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అలాగే సంస్థ సిబ్బందిని ఆర్టీసీ అభినందించింది. శ్వేతారత్నం అనే మహిళ  ఆస్పత్రికి వెళ్లేందుకు ఆరాంఘర్ వద్ద 1జెడ్ నెంబర్ బస్సు ఎక్కి ప్రయాణిస్తుండగా బహదూర్‌పుర వద్దకు రాగానే పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. గమనించిన మహిళా కండక్టర్ ప్రయాణికుల సహాయంతో బస్సులోనే ప్రసవం చేయగా శ్వేతారత్నం పండంటి ఆడబిడ్డకు జన్మించింది. అయితే సంఘటన జీహెచ్​ఎంసీ పరిధిలోని మూడు సర్కిళ్ల పరిధిలో జరగడంతో జనన మరణ ధ్రువీకరణ చట్టం 1969 ప్రకారం సర్కిల్ రిజిస్ట్రార్ బర్త్ సర్టిఫికెట్​ను పాప తల్లి శ్వేతారత్నానికి అందించారు. 

ABOUT THE AUTHOR

...view details