తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం - మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది - Fire Break Out In Furniture shop

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 10:13 AM IST

Fire Break Out In Furniture shop In Hyderabad : ఓ ఫర్నిచర్​ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్​లోని మంగళహాట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఆస్తినష్టం జరిగినట్లుగా సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లేపల్లిలో మంగళవారం రాత్రి ఒంటిగంట సమయంలో అల్​ అమ్ర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొంత సమయం పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అంతకు ముందు ఘటనా స్థలానికి పక్కనే ఉన్న టిఫిన్​ సెంటర్లోని సిలిండర్లను ముందుగా అక్కడ నుంచి స్వాధీనం చేసుకుని దూరంగా ఉంచారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ కాస్త ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details