వడదెబ్బకు కొబ్బరి చెట్టుపై స్పృహ కోల్పోయిన వ్యక్తి- చివరకు ఏమైందంటే! - Man Fainted In A Coconut Tree - MAN FAINTED IN A COCONUT TREE
Published : Apr 9, 2024, 8:12 PM IST
Man Fainted On Coconut Tree in Karnataka : కొబ్బరి చెట్టును నరికివేసేందుకు పైకి ఎక్కిన ఓ వ్యక్తి ఎండ దెబ్బకు ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. దీంతో చెట్టుపై వేలాడుతూ ఉండిపోయాడు. ఈ ఘటన కర్ణాటక హసన్ జిల్లాలోని కొల్లహళ్లి గ్రామంలో జరిగింది.
కొల్లహళ్లి గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి మంగళవారం కొబ్బరి చెట్టును నరికివేసేందుకు పైకి ఎక్కాడు. తీవ్రమైన ఎండల కారణంగా ఒక్కసారిగా కళ్లు తిరగాయి. దానితో పాటు ఎడమ చేతిలో నొప్పి కూడా రావటం వల్ల కిందకు దిగలేకపోయాడు. దీంతో చెట్టుపైనే వేలాడుతూ ఉండిపోయాడు. అతనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది చెట్టుపైకి ఎక్కారు. చెట్టుపై వేలాడుతున్న నవీన్‌ను సురక్షితంగా కిందకు దించి ప్రమాదం నుంచి కాపాడారు.
ఒకే చక్రంతో కన్యాకుమారి టు కశ్మీర్ సైకిల్ రైడ్
ఒకే చక్రంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేశాడు ఓ యువకుడు. కేవలం వెనుక చక్రంతో మాత్రమే సైకిల్ నడుపుతున్నాడు. అతడే కేరళలోని కన్నూర్‌కు నుంచి తన స్నేహితులతో కలిసి యాత్రను మొదలు పెట్టాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.