ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంచి నాయకుడ్ని ఎన్నుకోవడం మన చేతుల్లోనే ఉంది: అనంత శ్రీరాం - Lyricist Anant Sriram On Elections - LYRICIST ANANT SRIRAM ON ELECTIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 4:03 PM IST

Lyricist Anant Sriram Comments On Elections  in Eluru District : ఓటరు నీతిపరుడైతే పాలకులు కూడా భవిష్యత్తులో నీతిపరులైన వారు వస్తారని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం వద్ద జరిగిన ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని మెరుగైన సమాజ స్థాపన కోసం సహకరించాలన్నారు. 
ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్థావించారు. ఓటు వెయ్యడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వెయ్యాలని అదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని సూచించారు. మంచి నాయకుడ్ని ఎన్నుకోవడం మన చేతుల్లోనే ఉందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లకు ఓటు హక్కు అవశ్యకతను తెలియజేడానికి అవగాహన కల్పించడానికి పలువురు సినీ తారలు ప్రచారాల్లో పాల్గొంటున్నారు.  

ABOUT THE AUTHOR

...view details