LIVE : లోక్‌సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Session 2024 Live updates
Published : Feb 9, 2024, 11:07 AM IST
|Updated : Feb 9, 2024, 11:20 AM IST
Lok Sabha Sessions 2024 Live : లోక్‌సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చాలా కాలం విపక్షాలు ప్రతిపక్ష హోదాలోనే ఉంటాయని, వాటి దుస్థితికి కాంగ్రెస్ కారణమని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలో, ఎన్డీఏ 400లకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ మూడో టర్మ్‌లో గవర్నన్స్‌లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. వెయ్యేళ్లకు అవసరమైన బలమైన పునాది వేస్తామని చెప్పుకొచ్చారు.
కాగా లోక్‌సభలో శ్వేత పత్రం విడుదల చేశారు. 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ పదేళ్ల పాలనలోని సంక్షోభాలను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి చెందే సంస్కరణలను తీసుకొచ్చామని చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ గమ్యం అని, ఆ ప్రయాణంలో ఇంకా మైళ్ల దూరం వెళ్లాలని, పర్వతాలు అధిరోహించాలని ఆమె అన్నారు.