LIVE : లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం - lok sabha Session 2024 Live
Published : Jul 1, 2024, 11:05 AM IST
|Updated : Jul 1, 2024, 1:07 PM IST
Lok Sabha Sessions 2024 Live : గత వారం వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ మొదట చర్చను ప్రారంభించారు. అనంతరం దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్‌సూరీ స్వరాజ్ చర్చను కొనసాగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి లోక్‌సభ 16 గంటల సమయం కేటాయించింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానంతో చర్చ ముగియనుంది. అటు రాజ్యసభలో చర్చ కోసం 21 గంటలు కేటాయించగా.. బుధవారం ప్రధాని మోదీ సమాధానంతో చర్చ ముగియనుంది. నీట్ పేపర్ లీక్, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్షాలు పేపర్ లీక్‌తో పాటు నిరుద్యోగం అంశాన్ని లేవనెత్తాయి. గత వారం వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈరోజుకు వాయిదా పడ్డాయి. తిరిగి ఇవాళ కొనసాగుతున్నాయి.
Last Updated : Jul 1, 2024, 1:07 PM IST