LIVE : లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆషాఢ బోనాలు - Lal Darwaza Bonalu Live - LAL DARWAZA BONALU LIVE
Published : Jul 28, 2024, 7:11 AM IST
|Updated : Jul 28, 2024, 5:01 PM IST
Lal Darwaza Bonalu Live : హైదరాబాద్‌లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. ఇవాళ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళి మందిరంతోపాటు అక్కన్న మాదన్న ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చారిత్రక లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అలయానికి పలువురు మంత్రులతో పాటు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతోంది.
Last Updated : Jul 28, 2024, 5:01 PM IST