LIVE : తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్మీట్ - KTR PRESS MEET AT TELANGANA BHAVAN - KTR PRESS MEET AT TELANGANA BHAVAN
Published : Aug 16, 2024, 2:04 PM IST
|Updated : Aug 16, 2024, 2:34 PM IST
BRS Leader KTR Press Meet at Telangana Bhavan : ఉచిత బస్సు ప్రయాణాలపై తాను చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు మహిళా సోదరీమణులను బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. బుధవారం ఉచిత బస్సు ప్రయాణాలపై అవసరం అయితే బస్సుల్లో బ్రేక్ డాన్స్ వేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంపై అధికార పక్ష మంత్రి సీతక్క మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేడు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేడు ధర్నా నిర్వహిస్తోంది. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తున్నారు.
Last Updated : Aug 16, 2024, 2:34 PM IST