తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మూసీ నిర్వాసితులతో మాట్లాడుతున్న కేటీఆర్​ - KTR visited the Moose victims Live - KTR VISITED THE MOOSE VICTIMS LIVE

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 11:46 AM IST

Updated : Oct 1, 2024, 12:24 PM IST

KTR on Musi Residents Live : హైదరాబాద్​లో మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. అంబర్​పేట నియోజకవర్గంలో ఆయన పర్యంటిచారు. గోల్నాక, తులసీ రామ్​నగర్​ బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారన్న ఆయన  ఎప్పుడు ఇళ్లు కూల్చుతారో అని ప్రజలు ఆవేదనలో ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారని విమర్శించారు. మూసీమే లూఠో  దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్‌ నినాదమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కడతామంటూ కూల్చుతున్నారని మండిపడ్డారు.  పేదల ఇళ్లు కూల్చుతుంటే మీ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడపలుక్కున్నారా? అని అడిగారు. పేదలకు కష్టం వస్తే అండగా ఉండేవాడే దేవుడని అన్నారు. 
Last Updated : Oct 1, 2024, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details