కుటుంబ సమేతంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు - KTR Birthday Celebrations - KTR BIRTHDAY CELEBRATIONS
Published : Jul 24, 2024, 11:03 PM IST
KTR Birthday Celebrations in KCR Presence : హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తెతో కలిసి తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తల్లి శోభమ్మ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం తల్లిదండ్రుల పాదాలకు కేటీఆర్ నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, శోభమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్, మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు.
కుమారునికి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నందినగర్‌కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు. అంతకముందు తన పుట్టినరోజును కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని స్టేట్‌హోంలో విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలోనే 100 మంది విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. మరోవైపు, ఈ ఉదయం నుంచి గులాబీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.