తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : హైదరాబాద్​లో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - KishanReddy live - KISHANREDDY LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 12:22 PM IST

Updated : Apr 1, 2024, 1:21 PM IST

KishanReddy Live :  తెలంగాణలో అధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 క్లస్టర్లలో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, రాష్ట్ర నేతలు విస్తృతంగా యాత్రల్లో పాల్గొని శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్‌ కృతనిశ్చయంతో పనిచేస్తుందని  తెలిపారు. అందుకే మరోసారి బీజేపీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనంటూ ఆరోపించారు. బీఆర్ఎస్​, కాంగ్రెస్​కు ఓటు వేస్తే వృథా అవుతుందని పునరుద్హాటించారు. తొమ్మిదేళ్ల తమ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా తెలంగాణలో వరుసగా పర్యటించడంతో కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. తాజాగా నేడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. 
Last Updated : Apr 1, 2024, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details