తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సికింద్రాబాద్​ అభివృద్ధిపై కిషన్​రెడ్డి పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ - kishan reddy live - KISHAN REDDY LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 12:09 PM IST

Updated : Apr 18, 2024, 2:04 PM IST

Kishan Reddy Presentation on Secunderabad Development Live : సికింద్రాబాద్​ అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇస్తున్నారు. లోయర్​ ట్యాంక్​ బండ్​లోని వెంకట్​ రాంరెడ్డి ఫంక్షన్​ హాల్​లో ఈ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్​ పార్లమెంటు పరిధిలో కేంద్రమంత్రిగా ఐదేళ్లలో తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. మరొక్కసారి తనకు ఓటు వేయాల్సిన అవశ్యకతను కిషన్​రెడ్డి ప్రజలకు తెలుపుతున్నారు. అలాగే తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గానూ రెండంకెల స్థానాలు గెలవాలని బీజేపీ అధిష్ఠానం కంకణం కట్టుకుంది. అత్యధిక స్థానాలు గెలిచి తమ పట్టుకుు తెలంగాణలో పెంచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సభలు, రోడ్డు షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని వేగవంతం చేసింది. నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్​ 4న కౌంటింగ్​ ప్రారంభం కానుంది.
Last Updated : Apr 18, 2024, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details