తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : కిషన్​రెడ్డి మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - kishan reddy pressmeet live - KISHAN REDDY PRESSMEET LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 3:48 PM IST

Updated : Apr 5, 2024, 3:56 PM IST

Kishan Reddy Live : రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పేర్కొన్నారు.  2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని తీర్చిదిద్దేందుకు మోదీ సర్కార్‌ కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కిషన్​రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలందరూ మోదీ మార్కు చూసి, కమలంకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఫోన్​ ట్యాపింగ్​ చాలా తీవ్రమైన అంశమని,  ఫోన్​ ట్యాపింగ్​తో వ్యక్తి స్వేచ్ఛను హరించారని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. దేశభద్రతకు వాడాల్సిన టెక్నాలజీని, వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం దారుణమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వాడిన బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని ఆయన ఎలక్షన్ కమిషన్​ను కోరారు. ఫోన్ ట్యాపింగ్ సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్​, కాంగ్రెస్​కు ఓటు వేస్తే వృథా అవుతుందని ఆయన పునరుద్హాటించారు. 
Last Updated : Apr 5, 2024, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details