తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్​రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - కిషన్​రెడ్డి లైవ్

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 4:24 PM IST

Updated : Feb 19, 2024, 4:55 PM IST

BJP Leader Kishan Reddy Live : లోక్​సభ ఎన్నికల సమయం దగ్గర అవుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్​ రెడ్డి హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్​ ఎన్నికల్లో 17 స్థానాల్లో 10 సీట్లలలో గెలుపు దిశగా అడుగులేస్తుంది. దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 5 దశలుగా బీజేపీ బస్సు యాత్రను ప్రారంభించనుంది. దీనికి బీజేపీ సిద్ధమయిందని కిషన్​రెడ్డి తెలుపుతున్నారు. ఈ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. దీనిపై పూర్తి సమాచారాన్ని కిషన్​రెడ్డి వివరిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,025 కిలోమీటర్లలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నామని చెబుతున్నారు. ఈ నెల 20 తేదీ నుంచి మార్చి 1 వరకు జిల్లాల్లో యాత్రలు కొనసాగుతాయని వెల్లడిస్తున్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు, అదే పదేళ్లలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలు, ఆరు దశాబ్ధాల కాలంలో కాంగ్రెస్‌ లోపాలను ప్రజలకు తెలిపే విధంగా ప్రణాళికలు రూపొందించామని వివరిస్తున్నారు. 

Last Updated : Feb 19, 2024, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details